………………………………………
– మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం
– అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కంటతడి
– శ్రీనివాస్ గౌడ్ యాక్షన్ కింగ్ అని అంటున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
– శ్రీనివాస్ గౌడ్ హయాంలో పాలమూరు లో అభివృద్ధి ఎక్కడిది.. అంతా అరాచకమే అని అంటున్న యెన్నం
– తెలంగాణ ఉద్యమకారులను సైతం అక్రమ కేసు లతో జైలుకు పంపిన ఘనుడు శ్రీనివాస్ గౌడ్…. ఎమ్మెల్యే యెన్నం
– ఈ రోజు ముసలి కన్నీరు కారుస్తే నమ్మడానికి పాలమూరు ప్రజలు సిద్ధంగా లేరు
– ఈ మున్సిపల్ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ మూట ముళ్లే సర్దుకోవాల్సిందే.
………………………………….
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : 
………………………………..

పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు బీ ఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇటీవల ఎన్నికల ప్రచారం లో భాగంగా మాజీ మంత్రి, బీ ఆర్ ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ మినీ ట్యాంక్ బండ్ ను సందర్శించారు. ఈ సమయంలో తన హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు మాత్రమే ఉన్నాయని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా ట్యాంక్ బండ్ అభివృద్ధి ఎక్కడికక్కడ నిలిచిపోయాయని కంటతడి పెట్టుకున్నారు. ఆయన కంటతడి పెట్టారో లేదోకాని నిజానికి దూరంగా.. అబద్దానికి దగ్గర ఉండే ఓ పత్రిక కంటతడి వస్తే టవాల్ తో తుడుచ్చుకునే శ్రీనివాస్ గౌడ్ ఫోటోలను వైరల్ చేసింది.ఇదే కాకుండా బీ ఆర్ ఎస్ సోసియల్ మీడియా మరింత ప్రచారం చేసింది. తాను అధికారం లో ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి.. ప్రస్తుతం జరుగుతున్న చూస్తే బాధ కలుగుతున్నది శ్రీనివాస్ గౌడ్ అంటున్న మాటలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భగ్గు మన్నారు. ఏకంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి రంగం లోకి దిగి శ్రీనివాస్ గౌడ్ తీరును ఎండగట్టారు.మాజీ మంత్రీ…నీ రాజకీయ నాటకాలు ఎవరికి తెలియవు… ప్రజలను మభ్యపెట్టే రాజకీయ నాటకాలు పాలమూరు ప్రజలకు చాలా బాగా తెలుసని,ఇకనైనా అన్నీ మూసుకుని నిజాలు మాట్లాడం నేర్చుకో అని యెన్నం హితవు పలుకుతున్నారు.మినీ ట్యాంక్ బండ్ పై నిలబడి మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన నాటకీయ ప్రదర్శనలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని…ఒకసారి ఎమ్మెల్యేగా, ఐదేళ్లపాటు మంత్రిగా పనిచేసిన సమయంలో మహబూబ్‌నగర్ అభివృద్ధి కోసం ఏం చేశారో చెప్పాలని యెన్నం డిమాండ్ చేస్తున్నారు. పట్టణానికి విద్యాసంస్థలు, ఐఐఐటీ, ఇంజినీరింగ్ కళాశాలలు తీసుకురావాలని అప్పటి సీఎం కేసీఆర్ వద్ద ఒక్కసారి కూడా అడగని చరిత్ర నీదన్నారు.అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలపై మాట్లాడని నీవు, వ్యక్తిగత కక్షలకు పాల్పడి ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకోవడం రాజకీయ స్వార్థమేనని మండిపడ్డారు. నీవల్ల ఎన్ని కుటుంబాలు నష్టపోయాయో, ఎంతమంది ప్రజలు ఆవేదన చెందారో, ఉద్యమకారుల కుటుంబాలు సైతం నాడు ఎంత ఏడ్పించావో జిల్లా వాసులకు బాగా తెలుసన్నారు. మెయిన్ రోడ్డుపై కప్పు-సాసర్, వాటర్, బొమ్మలు చూపించి అభివృద్ధి చేశామని చెప్పుకోవడం ప్రజలను అవమానించడమేనని యెన్నం అంటున్నారు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో అభివృద్ధి చూపిస్తోందని, సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్ కార్పొరేషన్ అభివృద్ధికి రూ.2 వేల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయడం చరిత్రలోనే పెద్ద ముందడుగన్నారు. గతంలో ఎక్కడా లేని విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు రూ.603 కోట్లు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు శాశ్వత తాగునీటి సరఫరాకు రూ.220 కోట్లు మంజూరు చేయించామని… ఈ అభివృద్ధి మాజీ మంత్రి కి కనపడం లేదన్నారు.మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టు కొని మాజీమంత్రి చేస్తున్న డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారని ‘యెన్నం’ అంటున్నారు.శ్రీనివాస్ గౌడ్ పదేళ్ల పాలనలో అభివృద్ధి జరగలేదని, అంతా అవినీతి, అరాచకం రాజ్యమేలిందని, ఆయన హయాంలో లో పాలమూరు ఎన్నడూ ప్రశాంతంగా లేదని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు. అరాచక పాలన నుంచి అభివృద్ధి పాలన వైపు పాలమూరు అడుగులేస్తున్నదని వారంటున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికలు ఇరు పార్టీలకు రెఫరండంగా మారాయి.బీజేపీ కూడా ఎన్నికల ప్రచారం లో దూసుకెలుతోంది. రెండు రోజుల క్రితం ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ పాలమూరు లో ఆ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ఈ సమావేశనికి బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చారు. వారు కూడా పాలమూరు మున్సిపల్ గడ్డ బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా లో ఉన్నారు. ఎంపీ డీకే అరుణ మహబూబ్ నగర్, నారాయణ పేట జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం లో పాల్గొని పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తున్నారు.మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో 60 డివిజన్లు ఉన్నాయి. ఇందులో మ్యాజిక్ ఫిగర్ 31 డివిజన్ లో విజయం సాధించాల్సి ఉంటుంది. 50 స్థానాలు గెలిచి సీఎం రేవంత్ రెడ్డి కి గిఫ్ట్ గా ఇస్తానని ఇక్కడి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అంటున్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఈ మున్సిపల్ కార్పొరేషన్ లో గులాబీ జెండా ఎగురవేస్తామనే ధీమా లో ఉన్నారు.