Take a fresh look at your lifestyle.

రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షులు జితేందర్ ని కలిసిన రాష్ట్ర కార్యదర్శి పిట్టల బాలరాజు

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
కాంగ్రెస్ రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షులు మిద్దెల జితేందర్ జన్మదినం సందర్భంగా సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి పిట్టల బాలరాజు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా బాలరాజ్ మాట్లాడుతూ జితేందర్ 2023లో సేవాదళ్ బాధ్యతలు తీసుకొని ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రతి ఒక్క అసెంబ్లీ వారిగా సేవాదళ్ వాలంటీర్స్ నియమించి ఎమ్మెల్యేల గెలుపు కొరకు కృషి చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సామల రవీందర్, జనరల్ సెక్రెటరీ షేక్ వాజిద్, బ్లాక్ సేవాదళ్ అధ్యక్షులు లోక్ దాస్ ఉప్పలయ్య, యువజన కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రెటరీ పుట్ట శివకుమార్, బత్తిని జితేందర్ ప్రకాష్, శ్రీనివాస్, జల్తారాజు రాజు గౌడ్, సురేందర్, రాజశేఖర్, అంకం రాజేష్, మహిళా జిల్లా నాయకురాలు ప్రమీల పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.