Take a fresh look at your lifestyle.

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలను అమలు చెయ్యాలి. – బీసీ హక్కుల సాధన సమితి నాయకులు పాలభిందెల శ్రీనివాస్.

 

ముద్ర,కుత్బుల్లాపూర్:

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలను అమలు చెయాలనీ బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు బాచుపల్లి మండల డిప్యూటీ తహసీల్దార్ ఉమా మహేశ్వర రెడ్డి కీ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం బీసీ హక్కుల సాధన సమితి నాయకులు పాలభిందెల శ్రీనివాస్ మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ ప్రతి సంవత్సరం బడ్జెట్లో 20,000/- కోట్లు కేటాయిస్తాము అని అన్నారు. అదే విదంగా వివిధ సామాజిక తరగతులకు ఆర్థిక సహాయ సహకారాలు చేతు వృతులకు ఆర్థిక సహాయం వంటి హామీలు ఇవ్వడం జరిగింది. అని అన్నారు. కనుక వారం రోజులలో జరిగే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు 55వేల కోట్లు కేటాయించి, బీసీ డిక్లరేషన్ హామీలను నిజాయితీగా అమలు చేయాలనీ వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఇందిరమ్మ కాలనీ డివిజన్ కార్యదర్శి పొన్నకంటి దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.