ముద్ర ప్రతినిధి,, మెదక్:
జిల్లాలో ఇప్పటివరకు 17254 మంది రైతుల నుండి
80,411 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 86 కోట్లు చెల్లింపులు చేసినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. కొనుగోలు అయిన ధాన్యాన్ని సత్వరమే మిల్లులకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదివారం ఒక ప్రకటనలో ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ…
కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను కలెక్టర్ తెలుసుకొని, నిల్వలు లేకుండా వెను వెంటనే విల్లులకు తలించేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని అన్నారు. వేగవంతంగా రవాణా చేయుటకు దిశనిర్ధేశం చేశారు.
కొనుగోలు అయిన ధాన్యాన్ని సత్వరమే మిల్లులకు తరలించుటకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, లారీలపైనే ఆధార పడకుండా అవసరమైతే ఇతరాత్ర వాహనాలను ద్వారా మిల్లులకు చేరవేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అలాగే రోజువారిగా కేంద్రాlaలో గల నిల్వలు, మిల్లులకు తరలించిన వివరాల నివేదికలను సమర్పించాలని కలెక్టర్ కొనుగోలు కేంద్ర నిర్వాహకులను ఆదేశించారు.
ధాన్యాన్ని మిల్లులకు తరలించుటలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని నిర్వహకులకు కలెక్టర్ స్పష్టం చేశారు. గన్ని సంచులు, టార్పాలిన్లు సరిపడా అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని, కేంద్రాలలో ఉండే ప్రతి దాన్యం గింజను మిల్లులకు తరలించే వరకు శ్రమించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.
ఏమైన సమస్యలు ఉంటే తమ దృష్టికి తెవాలన్నారు. అలాగే ధాన్యాన్ని కొనుగోలు చేసిన వివరాలు, మిల్లులకు రవాణా చేస్తున్న ధాన్యం వివరాలను సంబంధిత రిజిష్టర్లలో పకడ్బందీగా నమోదు చేయాలని ఆదేశించారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Next Post