Take a fresh look at your lifestyle.

లేబర్ కోడ్స్ రూల్స్ ప్రతుల దహనం

ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లా కేంద్రంలో పోస్టపీసు వద్ద మోడీ ప్రభుత్వం కార్మిక వర్గ వ్యతిరేక లేబర్ కోడ్స్ ప్రతులను దగ్దం చేశారు. శ్రామికుల మెడలకు బిగించిన ఉరితాళ్లేనని సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ. మల్లేశం, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.పద్మ అన్నారు. ఎన్నికల వేళ మాయ మాటలతో ప్రజలను వంచించిన పాలకులు, గద్దెనెక్కిన వెంటనే కార్పొరేట్ శక్తుల పాదాల చెంత కార్మిక హక్కులను తాకట్టు పెట్టారని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ నశించేంత వరకు కార్పొరేట్, కమ్యూనల్ దోపిడీ పాలన అంతం అయ్యేంత వరకూ పోరాటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతాయని, జరిగే పరిణామాలకు ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఈ నిరసనలో ప్రజా సంఘాల నాయకులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె.మల్లేశం, షౌకత్, అజయ్, దుర్గ, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.