Take a fresh look at your lifestyle.

బాధిత కుటుంబాలకు చేయూత

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త యస్.కె.జహంగీర్ ఇటీవల ప్రమాదపుశాత్తు వాగులో పడి మృతిచెందగా ఆయన కుటుంబ సభ్యులకు రూ.20వేలు, అదే గ్రామానికి చెందిన దేవునూరి బాలయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా ఆయనను పరామర్శించి వారికి భువనగిరి మాజీ శాసనసభ్యులు పైళ్ళ శేఖర్ డ్డి పంపించిన రూ.10వేలు ఆర్థిక సహాయం అందజేసిన బీఆర్ ఎస్ పార్టీ తాజ్పూర్ గ్రామశాఖ అధ్యక్షులు డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ ఆదివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామా తాజా మాజీ సర్పంచ్ బొమ్మారపు సురేష్, సీనియర్ నాయకులు ఓరుగంటి రమేష్ గౌడ్, ఓరుగంటి వేణు గౌడ్, గ్రామ వార్డు మాజీ సభ్యులు, ముస్లీం మైనారిటీ నాయకులు, గ్రామప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.