పతంగి మరో బాలుడి ప్రాణాన్ని బలిగొంది
ముద్ర, బండ్లగూడ: పతంగి మరో బాలుని ప్రాణాలను బలిగొంది. ఈ సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం…. మంచిర్యాల జిల్లా బెల్లం పల్లి కి చెందిన మహేందర్ సుజాత దంపతులకు కుమారుడు ఉన్నాడు. వీరు కొద్ది సంవత్సరాల క్రితం జీవనోపాధికై నగరంలోని మైలార్ దేవ్ పల్లికి వచ్చారు. ఈ పోలీస్ స్టేషన్ పరిధి లోని సాయిబాబా నగర్ లో బిల్డింగ్ పైన హేమంత్ (10) పతంగి ఎగరవేస్తున్నాడు. ఆ సమయంలో కాళ్లు జారి బాణం పై నుండి కింద పడ్డాడు. తలకు తీవ్ర గాయాలకు గురైన బాలుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు. బాలుడికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్మార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు.