ముద్ర: తాండూర్. ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే రాజకీయాల్లోకి రావాలి తప్ప బంపర్ ఆఫర్లతో ప్రజలను మోసం చేయొద్దని 13వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 13వ వార్డులో బి ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురేష్ నాయక్ ఓడిపోతారని ఉద్దేశంతో, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తనకున్న సంస్థలలో 50% రాయితీ కల్పిస్తానని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇటువంటి బూటకపు మాటలకు ఎవరు కూడా మోసపోవద్దని, ఎంతోమంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పీఎఫ్ డబ్బులు చెల్లించకుండా, వారి డబ్బులతోటే వ్యాపారాలు చేస్తున్నా సంగతి తాండూర్ నియోజకవర్గ ప్రజలకు తెలుసునని ఆయన పేర్కొన్నారు. ఏమైనా ఉంటే అభివృద్ధిలో పోటీపడి గెలవాలి తప్ప ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని, ఏది ఏమైనా 13వ వార్డు ప్రజలపై తనకు పూర్తి నమ్మకం ఉందని, కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆయన పేర్కొన్నారు.