Take a fresh look at your lifestyle.

యష్ ‘టాక్సిక్’కు భారీ డీల్…తెలుగు రాష్ట్రాల హక్కులు దిల్ రాజు చేతికి

 

కన్నడ స్టార్ హీరో యష్ కథానాయకుడిగా నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ తెలుగు రాష్ట్రాల్లో భారీ చర్చకు దారి తీసింది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ పంపిణీ హక్కులు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇందుకోసం సుమారు రూ.120 కోట్ల మేర భారీ మొత్తాన్ని వెచ్చించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఒక డబ్బింగ్ చిత్రానికి ఈ స్థాయి డీల్ కుదరడం ఇదే తొలిసారిగా భావిస్తున్నారు.

‘టాక్సిక్’ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే అదే రోజున బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ధురంధర్ 2’ కూడా థియేటర్లలోకి రానుండటంతో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ తప్పదన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ క్లాష్ ప్రభావంతోనే అడివి శేష్ నటించిన ‘డెకాయిట్’ చిత్రం తన విడుదల తేదీని మార్చి 19 నుంచి ఏప్రిల్ 10కి మార్చుకున్నట్లు సమాచారం.

గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘టాక్సిక్’ పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ అనే ప్రత్యేక ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. యష్ నటిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందనే అంచనాలు బలంగా ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.