Take a fresh look at your lifestyle.

ప్రేమికుల రోజున ‘సీతా పయనం’…

 

యాక్షన్ కింగ్ అర్జున్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన విభిన్న కథా చిత్రం ‘సీతా పయనం’ విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమా ద్వారా అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ కథానాయికగా వెండితెరకు పరిచయం అవుతుండటం ప్రత్యేకతగా నిలుస్తోంది. నిరంజన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ వంటి అనుభవజ్ఞులైన నటులు కీలక పాత్రలు పోషించారు. అర్జున్ స్వయంగా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనుండగా, ఆయన మేనల్లుడు ధ్రువ సర్జా అతిథి పాత్రలో మెరవనున్నారు.

ప్రేమికుల రోజును లక్ష్యంగా పెట్టుకుని ఫిబ్రవరి 14న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు సెన్సార్ ప్రక్రియ పూర్తికాగా, సినిమా చుట్టూ మంచి బజ్ నెలకొంది. విడుదలైన పాటలు, ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతూ, అంచనాలను మరింత ఎగబాకేలా చేశాయి.

ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే భావోద్వేగాలతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలను సమతుల్యంగా మేళవించి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

సాంకేతికంగా కూడా ‘సీతా పయనం’ హై స్టాండర్డ్స్‌తో తెరకెక్కింది. జి. బాలమురుగన్ సినిమాటోగ్రఫీ అందించగా, సాయి మాధవ్ బుర్రా రచించిన డైలాగ్స్ సినిమాకు బలం చేకూర్చాయి. యాక్షన్ కింగ్ మార్క్‌కు తగ్గట్టుగా స్టంట్ సన్నివేశాలను కిక్ యాస్ కాళీ రూపొందించగా, అవి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వినూత్న ప్రచార వ్యూహాలతో ముందుకెళ్తున్న మేకర్స్ త్వరలో థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 14న ఐదు భాషల్లో విడుదల కానున్న ‘సీతా పయనం’ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

Leave A Reply

Your email address will not be published.