Take a fresh look at your lifestyle.

జర్నలిజానికి నైతిక దిక్సూచి: మల్లవఝల వంశీ కి ఘన అభినందనలు

  • టి యు డబ్ల్యూ జె (ఐ జే యు) పెద్దపల్లి జిల్లా కార్యవర్గ సమావేశం రామగిరిలో ఉత్సాహభరితంగా సాగింది.

రామగిరి, ముద్ర:పెద్దపల్లి జిల్లా టి యు డబ్ల్యూ జె(ఐ జే యు) అధ్యక్షులుగా సేవలందిస్తున్న మల్లవఝల వంశీ ని, రామగిరి మండలంలోని సెంటనరీ కాలనీలో నిర్వహించిన, టి యు డబ్ల్యూ జె, జిల్లా కార్యవర్గ సమావేశంలో ఘనంగా సత్కరించారు. ఈ సమావేశానికి సివిల్ సొసైటీ ఫోరం (సి ఎస్ ఎఫ్) కార్యవర్గ సభ్యులు ముచ్చకుర్తి చంద్ర మౌళి, లక్కం బిక్షపతి, వనం శివానందం, బల్ల శివశంకర్, తోట వేణు, ముడుతనపల్లి సారయ్య ప్రత్యేకంగా హాజరై వంశీ ని శాలువా, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు.సి ఎస్ ఎఫ్, సభ్యులు మాట్లాడుతూ “వంశీ జర్నలిజంలో నైతిక విలువలను అమలు చేస్తూ, మీడియాను ప్రజల సమస్యలపై స్పందించే ప్రాథమిక వేదికగా తీర్చిదిద్దుతున్నారు. ఆయన నాయకత్వంలో పెద్దపల్లి జిల్లా ప్రెస్ క్లబ్ చక్కటి ప్రమాణాలను నిలబెడుతోంది. ఫోర్త్ ఎస్టేట్‌కు స్ఫూర్తిదాయక దారి చూపుతున్నారు” అని ప్రశంసించారు.అలాగే వారు పేర్కొన్నారు.“సమాజానికి చైతన్యం కలిగించే లక్ష్యంతో టి యు డబ్ల్యూ జే, సి ఎస్ ఎఫ్ వేదికలను సమన్వయపరచి వంశీ చేస్తున్న కృషి అభినందనీయం. జర్నలిజం గౌరవాన్ని రక్షిస్తూ ప్రజాస్వామ్యక కావ్యంతో ముందుకు నడిపిస్తున్నారు” అని తెలిపారు.ఘన సత్కారం అనంతరం మాట్లాడుతూ వంశీ “మీరు చూపిన ఈ సన్మానం నాకు మరింత బాధ్యతను కలిగిస్తోంది. మీడియా విలువలను సమాజానికి చేరువ చేయడమే మా లక్ష్యం” అని తెలిపారు.కార్యక్రమం ఆత్మీయతతో కూడి, అభినందనల వాతావరణంలో ముగిసింది.సమావేశంలో టీయూడబ్ల్యూజే సభ్యులతో పాటు పలు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, ప్రాంతీయ పాత్రికేయులు కూడా పాల్గొన్నారు.సభలో పాల్గొన్న, సి ఎస్ ఎఫ్ సభ్యులు ముచ్చకుర్తి చంద్ర మౌళి, లక్కం బిక్షపతి, వనం శివానందం, బల్ల శివశంకర్, తోట వేణు, ముడుతనపల్లి సారయ్య, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.