ప్రతి ఒక్కరు తమ బ్యాంక్ అకౌంట్ యొక్క కెవైసీ అప్డేట్ చేసుకోవాలి – ఆందోల్ డివిజన్ ఆర్బిఐ కౌన్సిలర్ మురళీకృష్ణ
–
ఆందోల్, జనవరి 22 ముద్ర సంగారెడ్డి:
ప్రతి ఒక్కరూ బ్యాంక్ అకౌంట్ యొక్క కేవైసీ అప్డేట్ చేసుకోవాలని ఆందోల్ డివిజన్ ఆర్బిఐ కౌన్సిలర్ మురళీకృష్ణ అన్నారు. ఆదివారం కొన్యాల గ్రామంలో వారు మాట్లాడుతూ
బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కెవైసీ అప్డేట్ చేసుకోవాలని చెప్పారు.సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండి అకౌంట్లను సురక్షితంగా ఉంచుకోవాలి. ఏదైనా అపరిచిత నంబర్ నుంచి ఫోన్ కాల్స్ వస్తే ఓటీపీలు కానీ బ్యాంక్ సంబంధించిన వివరాలు కానీ ఇతరులకు చెప్పకూడదు అని అన్నారు. ప్రభుత్వం నుండి వచ్చే ఇన్సూరెన్స్ ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన మరియు జీవన్ జ్యోతి బీమా యోజన గురించి తెలిపారు.సైబర్ మోసాల గురించి అప్రమత్తంగా ఉండాలన్నారు. అకౌంట్ కు సంబంధించి సైబర్ నేరాలపై ఫిర్యాదు చేయాలనుకుంటే 1930 కి కాల్ చేసి అకౌంట్ ను సురక్షితంగా కాపాడుకోవాలి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళా సంఘాలు గ్రామస్తులు , యువకులు,పాల్గొన్నారు.