Take a fresh look at your lifestyle.

కారు ప్రమాదం లో ఒకరి మృతి

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కల్లెడ గ్రామపంచాయతీ దోస్త్ నగర్ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక రెవిన్యూ ఉద్యోగి నసీరుద్దీన్ (50) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి. మంచిర్యాల జిల్లా జాఫర్ నగర్ వాడకు చెందిన ల్యాండ్ అండ్ రెవెన్యూ సర్వే డి ఐ నసీరుద్దీన్ నిర్మల్ నుండి కుటుంబ సభ్యులతో మంచిర్యాలకు వెళుతుండగా మార్గమధ్యంలో కడెం మండలం దోస్త్ నగర్ సమీపంలోకారు రోడ్డు పక్కన చెట్టును బలంగా ఢీకొట్టడంతో ఘటన స్థలంలోనే నసీరుద్దీన్ (50) మృతి చెందాడు. కూతురు నేహ సహారీన్ మనువడు హైరా హురన్ లకు గాయాలయ్యాయి సంఘటన స్థలానికి కడెం 108 అంబులెన్స్ వైద్య సిబ్బంది ఈఎంటి మురళి పైలట్ వసంత్ చికిత్స నిమిత్తం వారిని లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి కడం ఎస్ ఐ పి సాయికిరణ్ చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.