Take a fresh look at your lifestyle.

ఏసీబీకి పట్టుబడ్డ నారాయణపేట ఆర్డిఓ

 

లేటు బర్త్ సర్టిఫికెట్ల కోసం 25 వేలు లంచం

వివరాలు వెల్లడించిన ఏసిబీ డిఎస్పీ బాలకృష్ణ

ముద్ర, నారాయణపేట:

నారాయణపేట ఆర్డీవో రామచంద ర్ నాయక్ మంగళవారం ఏసీబీకి పట్టుబడ్డారు. లేట్ బర్త్ సర్టిఫికెట్ల కోసం లంచం డిమాండ్ చేయగా ఒక్కో బర్త్ సర్టిఫికెట్ కు రూ.5 వేల చొప్పున రూ. 25వేలు లంచం తీసుకుంటూ ఈసీబీకి పట్టుబడ్డారు.

ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ మాట్లాడుతూ గత సంవత్సరం జూలై లో ఓ వ్యక్తి బర్త్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా తాసిల్దార్ కార్యాలయం నుంచి ఆర్డిఓ కార్యాలయంకు ఫైల్ ఫార్వర్డ్ అయిందని బర్త్ సర్టిఫికెట్ల కోసం ఆర్డీఓ లంచం డిమాండ్ చేయగా డబ్బులు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేసే ఏసీబీని ఆశ్రయించవచ్చని ఏసీబీ నీ ఆశ్రయించిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఇదిలా ఉండగా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా అక్రమంగా కొంతమంది రైతుల పాసుబుక్కులు పెట్టించి నష్టపరిహారం డబ్బుల పేరిట పెద్ద కుంభకోణం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి గతంలో ఆరోపించారు. ఈ అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని లోతైన దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కాగ నారాయణపేట ఆర్డిఓ రిటైర్మెంట్ సమయం కూడా దగ్గర పడిందని ఈ సమయంలోనే గతంలో నారాయణపేట ఆర్డీవో గా పని చేసిన రామచందర్ నాయక్ ను రిటర్మెంట్ సమయంలో రెవెన్యూ అక్రమాలు జరిపించేందుకు నారాయణపేట ఆర్డీవో గా తిరిగి ఇక్కడికి పిలిపించినట్లు సమాచారం. ఏది ఏమైనాప్పటికీ నారాయణపేట ఆర్డిఓ ఏసీబీకి పట్టుపడడం జిల్లా కేంద్రంలో హాట్ టాపిక్ గా మారింది.

Leave A Reply

Your email address will not be published.