Take a fresh look at your lifestyle.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం – ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
…………………………………….
రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తున్నదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.నియోజకవర్గంలోని హన్వాడ మండల కేంద్రం, నాయినోనిపల్లి లో ఐకెపి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకూ కొంటామన్నారు.రైతే రాజు అని, రైతుల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతులు తమ పంటలను నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. మధ్యవర్తుల మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వరి కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రైతులు సంతోషంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రైతు సంక్షేమానికి ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర అందించడంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రైతుల ఆర్థిక భారం తగ్గించేందుకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేసి ఉపశమనం కల్పించామని తెలిపారు. రైతు బంధు పథకం ద్వారా పెట్టుబడి సహాయం అందిస్తున్నామని, కౌలు రైతుల కోసం ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి రైతుకు ప్రభుత్వ పథకాల లబ్ధి అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి రైతు సంక్షేమ చర్యలు కీలకమని, ప్రతి రైతు కుటుంబం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. వేసవి దృష్ట్యా చల్లటి తాగునీరు, విశ్రాంతి సదుపాయాలు ఏర్పాటు చేయాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. గన్నీ బస్తాలు సమృద్ధిగా సిద్ధంగా ఉంచాలని, కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులు సులభంగా తమ ధాన్యం విక్రయించుకునేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత , హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్ , సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, నవనీత, యాదిరెడ్డి, సర్పంచ్ లు బొట్టు శ్రీను, శ్రీను నాయక్, సుధాకర్, నాయకులు టంకర కృష్ణయ్య యాదవ్, తిరుపతయ్య, షబ్బీర్ హుస్సేన్, మోహన్, క్రిష్ణ,నర్సింహులు, వెంకటయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.