రాయికల్,ముద్ర విలేకరి: జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన ద్యా వనపల్లి రామచంద్రం గత 34 సంవత్సరాలుగా రాయికల్ పోలీస్ స్టేషన్ లో హోం గార్డ్ గా విధులు నిర్వహించి,ఇటీవల పదవి విరమణ పొందారు.కాగా ఆయన మండల ప్రజలకు,పోలీస్ శాఖకు,పాత్రికేయులకు మధ్య సమన్వయ కర్తగా పనిచేసి అందించిన సేవలను గుర్తించి రాయికల్ ప్రెస్ క్లబ్ కార్యాలయం లో ప్రెస్ క్లబ్ (జేఏసీ)సభ్యులు రామచంద్రం ను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా అధ్యక్షులు వాసరి రవి మాట్లాడుతూ హోం గార్డ్ రామచంద్రం పోలీస్ శాఖ లో నిస్వార్థంగా,నిబద్ధతతో పనిచేసి మండల ప్రజల మన్ననలు పొందారు అని అన్నారు.ప్రతి ఒక్కరూ స్వార్థం వీడితే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని ఆయన అన్నారు.సమాజ హితం కోరే రామచంద్రం రానున్న రోజుల్లో సైతం ప్రజాసేవకు అంకితం అవ్వాలని కోరారు. అనంతరం ప్రధాన కార్యదర్శి కడకుంట్ల జగదీశ్వర్,కోశాధికారి మచ్చ శేఖర్ మాట్లాడుతూ రామచంద్రం వృత్తి పట్ల నిబద్ధత తో పని చేయడం వల్ల మంచి గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు.సీనియర్ పాత్రికేయులు ఎండి ముజాఫర్,రసూల్ లు మాట్లాడుతూ రామచంద్రం ఏళ్ల తరబడి చాలీచాలని వేతనంతో వృత్తి పట్ల క్రమశిక్షణతో,ప్రజల పట్ల,పాత్రికేయ రంగం పట్ల గౌరవం గా సంబంధాలు కొనసాగించడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు సాధించారని అన్నారు.అనంతరం రాయికల్ ప్రెస్ క్లబ్ జేఏసీ సభ్యులు హోంగార్డు రామచంద్రం ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు సింగిడి శంకర్,నాగమల్ల శ్రీకర్,సింగనీ శ్యాం సుందర్,గంగాదరి సురేష్, వాసం లింబాద్రి, ఎద్దండి ముత్యపు రాజు రెడ్డి,పాత్రికేయులు ఇమ్మడి విజయ్,వై.కిరణ్ రావు,మాణిక్యం గంగాధర్,మహేష్,రాజేష్,కళ్యాణ్,సంజీవ్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.