Take a fresh look at your lifestyle.

అభివృద్ధి చేస్తే…ఆగం చేశారు  – మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ 

 

ముద్ర, ఉమ్మడి 

మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :

……………………………………….

పాలమూరు పట్టణం లో బీ ఆర్ ఎస్ అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ అధికారం లోని వచ్చి ఆగం చేస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం పట్టణం లో తన హయాంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు చేసిన ప్రాంతాలను ఆయన సందర్శించారు.గ్రామాల నుంచి పనుల నిమిత్తం పట్టణానికి వచ్చిన పేదలకురూ. 5 కే భోజనం పెట్టేందుకు బస్టాండ్ వద్ద ప్రారంభించామన్నారు. ప్రస్తుతం ఇక్కడ భోజనం చేసేందుకు వేసిన టెంట్ పూర్తిగా రంద్రాలు పడి పనికి రాకున్నా కొత్త టెంట్ వేయడానికి మున్సిపాల్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు.  భోజనం సిద్ధం చేసేందుకు పెద్ద భోజనశాల కోడూరు వద్ద ఏర్పాటు చేసామన్నారు.

పేదలు గౌరవంగా తినేందుకు షెడ్ ఏర్పాటు చేసామని, అవసరం అయితే అప్పుడప్పుడు టూరిజం కాంప్లెక్స్ వినియోగించుకున్నారన్నారు.ఆసుపత్రి,ఇతర నిర్మాణాల కారణంగా వాటిని తొలగించి తాత్కాలిక ఏర్పాట్లు చేసామన్నారు.ఆసుపత్రి నిర్మాణం పూర్తి అయితే  వసతులు కల్పించాలని అనుకున్నామని, అందు కోసమే తాత్కాలిక ఏర్పాట్లు చేసామన్నారు. మా హయాంలో  చేసిన ఏర్పాట్లు తప్ప  రెండున్నర ఏండ్లలో కాంగ్రెస్ సర్కార్ వసతులు కల్పించలేదని విమర్శించారు .  చిరిగిన టెంట్లు,రోడ్ల పై పేదలు చేస్తున్న భోజనం వారికళ్లకు కనిపించడం లేదన్నారు.కలెక్టర్, మున్సిపల్ కమీషనర్ ఈ ప్రాంతం మీదుగా  విధులకు వెళుతున్న సమయం లో  చిరిగిన టెంట్లు.. పేదల కష్టలు కనిపించడం లేదా అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఇదేకాక అన్ని కులావృతుల గురించి ప్రస్తుత తరలకు తెలిసేలా ఫౌంటేన్, బొమ్మలు ఏర్పాటు చేస్తే కనీసం దాన్ని పట్టించుకోకపోవడం తో బొమ్మలు కళావిహీనంగా మారాయన్నారు.

కొత్త టెంట్ వేసి పేదలకు భోజనం పెట్టకుంటే  అధికారుల కార్యాలయాలు ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.

రేపటిలోగా పేదలు ఆత్మగౌరవం గా భోజనం చేసేందుకు వసతులు కల్పించకుంటే..తానే స్వయంగా అవసరమైన వసతులు కల్పిస్తానన్నారు. నియోజకవర్గం ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలి కానీ  రాజకీయం చేసి తన పై కక్ష తో పాలమూరును ఆగం చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.