Take a fresh look at your lifestyle.

ఫిట్నెస్ లేని వాహనాలను సీజ్‌ చేయాలి

  • పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
  • పీడీఎస్ యూ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్.
  • పీడీఎస్ యూ ఆధ్వర్యంలో అర్. టి.ఓ ఆఫీస్ ముందు ధర్నా.

ముద్ర ప్రతినిధి, ఉమ్మడి ఖమ్మం: స్కూలు బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్‌ లేకుండానే రోడ్లపై నడుపుతున్నా జిల్లా రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని పీడీఎస్ యూ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి వొంగూరి వెంకటేష్ ఆరోపించారు. ఫిట్నెస్ లేని బస్సులను వెంటనే సిజ్ చేయాలనీ డిమాండ్ చేస్తూ పీడీఎస్ యూ ఆధ్వర్యంలో ఖమ్మంలోని జిల్లా రవాణా శాఖ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వెంకటేష్ మాట్లాడుతూ మోటార్‌ వాహనాల చట్టం ప్రకారం వాహనాలను నడిపే డ్రైవర్ల వయసు 60 ఏళ్లలోపు ఉండాలన్నారు. డ్రైవర్‌ భారీ వాహనాల లైసెన్స్‌ కలిగి వుడడంతో పాటు విద్యార్థులు బస్సు ఎక్కే, దిగే సమయంలో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునేందుకు సహాయకుడుని నియమించాలన్నారు. అలాగే బస్సులో ప్రథమ చికిత్స కిట్‌, అగ్నిమాపక పరికరాలు, సీట్ల మధ్య నిర్ణీత ఖాళీ స్థలం, అత్యవసర మార్గాలు ఉండాలన్నారు. వాహనానికి సంబంధించి ఆర్‌సీ, పొల్యూషన్‌, ఇతరత్రా పత్రాలతో పాటు వాహనం టైర్లు, బ్రేకులు, ఇంజిన్‌ సరైన కండీషన్‌ లో వుండాలన్నారు. కానీ ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ బస్సులు ఏ ఒక్క నిబంధనను పాటించడం లేదన్నారు. వెంటనే ఫిట్‌నెస్‌ లేని వాహనాలు రోడ్ల పైకి వస్తే సీజ్‌ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే15 ఏళ్లు దాటిన విద్యా సంస్థల బస్సులు ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపై తిరగనివ్వద్దని కోరారు. నిబంధనలు పాటించని యాజమాన్యాలపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోవాలన, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం ఆర్టీఓ వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యూ జిల్లా నాయకులు యశ్వంత్, కార్తీక్, సందీప్, నవీన్, సతీష్, ఉమర్, అనిల్, అఖిల్, ఉమేష్, సుధాకర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.