Take a fresh look at your lifestyle.

నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

 

నేడు భారీగా నామినేషన్ లు వేసే అవకాశం

బీ ఫామ్ కోసం అభ్యర్థుల పాకులాట

ముద్ర, నారాయణ పేట ప్రతినిధి:


నారాయణపేట మున్సిపల్ ఎన్నికల నేపథంలో బుధవారం జిల్లా కేంద్రంలోని 18, 20 వార్డులకు గాను ఇద్దరూ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు నామినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ సిక్త పట్నాయక్, ఎస్పీ డా. వినీత్ కుమార్ లు పరిశీలించారు. కాగ నేడు( గురువారం) పెద్ద ఎత్తున నామినేషన్ దాఖలు వేసే అవకాశం ఉంది. కాగ ప్రధాన పార్టీ లలో కేవలం కొన్ని వార్డులకు మాత్రమే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. మిగిలిన వార్డులకు అభ్యర్థుల పేర్లు ప్రకటించకపోవడంతో అభ్యర్థులు నానా తంటాలు పడుతున్న పరిస్థితి నెలకొంది. బీజేపీ లో మాత్రం చైర్మెన్ అభ్యర్థి పేరు ప్రకటన పై కొంత వరకు పలువురు కౌన్సిలర్ అభ్యర్థుల మధ్యన కోల్డ్ వార్ వాతావరణం కనిపించింది. బీ ఫాం సొంతం చేసుకునేందుకు అభ్యర్థులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కొన్ని వార్డులలో అభ్యర్థులు ప్రచారం సైతం ప్రారంభించారు. ఏది ఏమైనప్పటికీ జిల్లా కేంద్రంలో మునిసిపల్ ఎన్నికల హీట్ ప్రారంభమైందని చెప్పవచ్చు.

Leave A Reply

Your email address will not be published.