Take a fresh look at your lifestyle.

దైవ భక్తి కలిగి ఉండి సనాతన ధర్మాన్ని కాపాడాలి: ఎస్సై సతీష్

గొల్లపల్లి, ముద్ర: సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గొల్లపల్లి ఎస్ ఐ చిర్ర సతీష్ అన్నారు. జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం భీంరాజ్‌పల్లిలో శ్రీరామనవమి సందర్భంగా బీబీకే ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ, బీబీకే ట్రస్ట్‌ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. అందులో భాగంగా డాక్టర్‌ శిల్పాదీదీ ప్రవచనాలు మారుమూల ప్రాంతాలకు విస్తరించేలా చేయడం భక్తులను సువర్ణ అవకాశమన్నారు. ఈ కార్యక్రమంలో బీబీకే ట్రస్ట్‌ అధినేత బొమ్మెన కుమార్, బీజేపీ మండల అధ్యక్షుడు కట్ట మహేశ్, లీడ్‌ ఇండియా శిక్షణ సమన్వయ కర్త తాడూరి శ్రీనివాస్‌ఆచార్య, తాడూరి సత్యనారాయణ, జక్కుల తిరుపతి, తాడూరి వంశీకష్ణ,  న్యాయవాది విశాల్‌రావు, రాజశేఖర్, మద్దూరి నవీన్, గుండ ప్రశాంత్‌గౌడ్,మారం మహేశ్‌ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.