Take a fresh look at your lifestyle.

రాఘవపూర్లో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం

ముద్ర ప్రతినిధి. బీబీనగర్:

బీబీనగర్ మండలం రాఘవరావు గ్రామంలో ఆదివారం గొలనుకొండ పద్మ శ్రీశైలం, జొర్రిగల భాగ్యమ్మ ఆంజనేయులు, చిక్క ఉమారాణి వెంకటేష్ గార్ల ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం జరిగింది. ఈ కార్యక్రమలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పొట్టోల శ్యామ్ గౌడ్, సర్పంచ్ సిద్ధగోని శ్రీకాంత్ గౌడ్ హాజరై ఆడిని అభినందించారు. ఈ సందర్బంగా పొట్టోల శ్యామ్ గౌడ్ గారు, సిద్ధగోని శ్రీకాంత్ గౌడ్ గృహప్రవేశం చేసిన దంపతులకు నూతన వస్త్రాలు అందచేసి శుభాకాంక్షలు తెలియచేసారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా ఇంటి కోసం ఎదురు చూసిన తమ కల సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, ఇందిరమ్మ కమిటీ సభ్యులకు ధన్యవాదములు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సిలివేరు కవిత మహేష్ ,వార్డ్ సభ్యులు తొర్పూనూరి రవి గౌడ్, న్యాలపట్ల అజయ్ గౌడ్, కొమ్ము మంగమ్మ నరేందర్, గ్రామ శాఖ అధ్యక్షులు మేకల కుమార్, నాయకులు రక్తని కృష్ణ, అంబటి చంద్రయ్య , రక్తని మల్లేష్ ,పాములపర్తి కృష్ణ, బోల్లోజు నరేంద్ చారి, అంబటి జంగయ్య, కొర్ని రమేష్ , అంబటి కిషన్ , గొలనుకొండ ప్రసాద్ , చిక్క బసవరాజ్ ,, రక్తని అంజి , గొలనుకొండ పురుషోత్తం , పబ్బతి సురేష్ , గొలనుకొండ నవీన్, సిద్ధగోని రవితేజ, ఎల్లంల నాని ,ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.