Take a fresh look at your lifestyle.

రోడ్డుఫై గుంతలను పూడ్చి వేయించిన కౌన్సిలర్ జాలిగం విగ్నేష్

 
ముద్ర, భువనగిరి ప్రతినిధి :
భువనగిరి పట్టణంలోని 22వ వార్డులో నల్లగొండ చౌరస్తా న్యూ రాంనగర్ లో ప్రమాదకరంగా మారిన రహదారి గుంతలను భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో ఆదివారం 22వ వార్డు కౌన్సిలర్ జాలిగం విగ్నేష్ రోడ్లు భవనాల శాఖ అధికారులతో మాట్లాడి పూడ్చి వేయించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ జాలిగం విగ్నేష్ మాట్లాడుతూ సంవత్సరం పైగా కాలం నుండి ప్రమాదకరంగా మారి ప్రజలకు ఇబ్బందిగా మారిన జాతీయ రహదారి గుంత వల్ల ఎంతోమంది ప్రమాదాలకు గురయ్యారని వార్డు ప్రజల ద్వారా విషయం తెలిసిన వెంటనే శాసనసభ్యులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించడం వారితో సమన్వయం చేసుకొని యుద్ధ ప్రాతిపదికల గుంతను పూడ్చివేయించడం జరిగిందన్నారు. వార్డు ప్రజలందరూ మీ సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పోతంశెట్టి వెంకటేశ్వర్లు, 8వ వార్డు కౌన్సిలర్ తాహెరా మజర్ పాషా, బట్టు మహేందర్, వరుణ్, సాదిక్, సాయి రత్నాకర్ శివతేజ రోడ్లు భవనాల శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.