Take a fresh look at your lifestyle.

ప్రజావాణికి 65 అర్జీలు

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 65 అర్జీలు వచ్చాయి. ఈ సందర్బంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని అన్నారు. ఆయన, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి , వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు.
అందులో రెవిన్యూ శాఖ 46, పిడి హౌసింగ్ 4, సర్వేల్యాండ్ 4, జిల్లా పంచాయతీ 3 శిశు సంక్షేమం 2, జిల్లా గ్రామీణ అభివృద్ధి 2, సివిల్ సప్లై, కో-ఆపరేటివ్, డి పి ఆర్ఓ, మార్కెటింగ్ శాఖలకు ఒక్కటి చొప్పున వచ్చాయని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, జెడ్పీ సి.ఈ.ఓ శోభారాణి , జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి , వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.