Take a fresh look at your lifestyle.

భువనగిరి మున్సిపల్ లో పోలింగ్ ప్రశాంతం 82.93% పోలింగ్

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి మున్సిపల్ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. ఎన్నికల్లో 82.93% పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. భువనగిరి పట్టణంలో మొత్తం 35 వార్డులకు ఎన్నికలు జరగగా బిజెపి, బి ఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరా హోరీగా ఎన్నికల జరిగాయి. జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి హనుమంతరావు 20వ వార్డు పోలింగ్ కేంద్రం బీచ్మహాల్ల హైస్కూల్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, కుటుంబ సభ్యులతో కలసి 3 వ వార్డు రాయగిరి లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎన్నికల పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.
భువనగిరి మున్సిపల్ పరిధిలో మొత్తం 39 వేల 664 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నెల 13న జరిగే ఓట్ల లెక్కింపు తో అభ్యర్థుల భవితవ్యం తెలనుంది.

Leave A Reply

Your email address will not be published.