Take a fresh look at your lifestyle.

ఇంటీరియర్ డిజైన్ స్టూడియోను ప్రారంభించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్

 

ముద్ర, శేరిలింగంపల్లి :

శేరిలింగంపల్లి డివిజన్ లో గల నార్నె ఈస్టేట్స్ మెయిన్ రోడ్డు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన డీకోన్ మోడ్యులర్ ఫ్యాక్టరీ ఇంటీరియర్ డిజైన్ స్టూడియోను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన కార్పొరేటర్ నాగేందర్.
ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా వ్యాపార రంగాలలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అలాగే మరికొందరికి ఉపాధి కల్పించాలని, స్వయం ఉపాధి ద్వారా దేశాభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు.
ఈ సందర్బంగా పది మంది యువతకు ఉపాధి కల్పించినందుకు డీకోన్ మోడ్యులర్ ఫ్యాక్టరీ నిర్వాహకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రోషిని, అనూప్ మీశ్రా, కయితీ కొండల్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.