Take a fresh look at your lifestyle.

విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయాన్ని శనివారం తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించగా, ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు జ్ఞాపిక, శాలువాతో మంత్రిని సత్కరించారు.


దర్శనానికి విచ్చేసిన రెండు తెలుగు రాష్ట్రాల భక్తులతో మంత్రి ఆత్మీయంగా ముచ్చటించి, వారి అభివాదాలను స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కనకదుర్గమ్మపై తనకు ఉన్న అపార భక్తిని వ్యక్తం చేస్తూ, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖశాంతులతో, సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.