ముద్ర మల్కాజిగిరి:
మల్కాజిగిరి ఆనంద్ బాగ్ డివిజన్ పరిధిలోని అనంత సరస్వతి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు మాజీ కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్ కూడా పాల్గొన్నారు.
దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రత్యేక హోమాలు, అర్చనలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు దేవాలయ అభివృద్ధికి తాను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఈ ఓ రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు బి బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, బి కే శ్రీనివాస్, పిట్టల శ్రీనివాస్, జి ఎన్ వి సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాలు శాంతి, సౌభ్రాతృత్వ వాతావరణంలో కొనసాగుతున్నాయని దేవస్థాన కమిటీ సభ్యులు తెలిపారు.