Take a fresh look at your lifestyle.

అభివృద్ధి పనులు వేగవంతం అయ్యేలా చర్యలు -ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

 

ముద్ర కాప్రా:

ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని కాలనీల అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగేలా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.
బుధవారం కుషాయిగూడ డివిజన్ పరిధిలోని శివ సాయి నగర్ లో నాలుగు కోట్ల 55 లక్షలతో జరుగుతున్న బాక్స్ డ్రైన్ అభివృద్ధి పనులను సర్కిల్ ఇంజనీరింగ్ అధికారులు, స్థానికుల తో కలిసి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాప్రా సర్కిల్ కుషాయిగూడ డివిజన్ పరిధిలోని సాయి నగర్ శివ సాయి నగర్ మీనాక్షి నగర్ తదితర కాలనీలు వరద మురుగు నీటి ముంపుతో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గాను నాలుగు కోట్ల యాభై ఐదు లక్షలతో బాక్స్ డ్రైవ్ పనులను చేపట్టడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ అధ్యక్షులు ఎంపల్లి పద్మారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నేమూరి మహేష్ గౌడ్, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.