Take a fresh look at your lifestyle.

శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్ లో 8 మంది గల్లంతు

  • రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి 
  • హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న మంత్రులు, అధికారులు

అచ్చంపేట ముద్ర: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఎస్ ఎల్ బి సి సొరంగం లోపల 14 కిలోమీటర్ల పైకప్పు కూలి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మందికి సంబంధించిన ఆచూకీ లభించలేదు శనివారం ఉదయం విధులకు వెళ్లిన సుమారు 40 నుండి 45 మంది కార్మికులు అధికారులు ఎస్ఎల్బీసీ స్వరంగంలోకి విధులకు వెళ్లారు. ఎస్ ఎల్ బి సిఎడమవైపు 14వ కిలోమీటర్ వద్ద సొరంగం పైకప్పు ఊడిపడి ఈ ప్రమాదం సంభవించినట్లు అ సంబంధిత అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటలకు దాదాపుగా40 నుండి 45 మందికి పైగా కార్మికులు సొరంగంలోకి వెళ్ళగా టన్నల్ బోరింగ్ మిషన్ వెనుక భాగంలో ఉన్నటువంటి వారంతా సురక్షితం ముందు భాగంలో ఉన్నటువంటి ఎనిమిది మంది ప్రమాదంలో చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు.

అనంతరం 8 మంది మినహా మిగతా వారందరూ ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు పేర్కొన్నారు. వీరిలో ముగ్గురు మట్టిలో చిక్కుకోగా వారిని వెంటనే తోటి కార్మికులు బయటకు తీసుకువచ్చారు. వీరిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. అయితే తనను బోరింగ్ మిషన్ ముందు భాగంలో మొట్టమొదట భారీగా నీరు వచ్చి తర్వాత మట్టి కుప్పలు పై నుండి పడినట్లు బయటకు వచ్చిన కార్మికులు తెలిపారు తండాలు ముందు భాగంలో ఉన్నటువంటి వారి వివరాలు అధికారులు తెలిపారు.

విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసి వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు సిబ్బందికి రక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి మరియు జూపల్లి కృష్ణారావు మరియు ఎస్పి వైభవ్ రంగనాథ్, జిల్లా కలెక్టర్ సంతోష్, రెస్క్యూటిమ్, ఫైర్ సిబ్బంది హుటాహుటిన బయలుదేరి సహా చర్యలు ప్రారంభించారు.

మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు,ఎస్ఎల్బీసీ టన్నల్ సొరంగ మార్గం వద్దకు చేరుకొని తప్పిపోయిన వారి వివరాలు అధికారులతో ఏ విధంగా సంఘటన జరిగిందని వివరాలు అడిగితెలుసుకున్నారు. ఎస్ ఎల్ బి సి స్వరంగం లోపల చిక్కుకున్నవారు అర్జున్ ప్రసాద్, శ్రీనివాస్, సందీప్ సాహూ, జగతస్, సంతోష్ సాహు, అర్జున్ సాహూ, సన్నీ సింగ్, గురుప్రీత్ సింగ్ లు పంజాబ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుండి వచ్చి విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

కాగా రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి టన్నల్ లో చిక్కుకుపోయిన వారు ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నారని అమెరికన్ ఇంజనీర్ ను వివరాలు అడిగి మరీ తెలుసుకున్నారు. ఎస్ ఎల్ బి సి సొరంగం ద్వారాసాగునీరు అందించాలనే లక్ష్యంతో శ్రీశైలం ఎడమ గట్టు సొరంగం ఎస్ఎల్బీసీ 2005లో వైయస్సార్ ప్రభుత్వం 200200 కోట్లతో అనుమతులు మంజూరు చేసింది. సుమారు 1935 కోట్లతో 60 నెలల్లో పనీ పూర్తి చేయాలని నిర్మాణ సంస్థలు కాంట్రాక్టులను చేజిక్కించుకున్నారు.

సుమారు నల్గొండ జిల్లాకు 30 టీఎంసీల నీరు అందించాలన్నదే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టన్నల్ రీబోరింగ్ మిషన్ మరమత్తు కోసం నిధులు ఇవ్వకపోవడంతో 2019 డిసెంబర్లో పనులు ఆపివేశారు అయితే ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ పాలనలో నల్లగొండ మంత్రుల చొరవతో మళ్లీ ఎస్ఎల్బీసీ సొరంగం పనులు మొదలయ్యాయి . పునః ప్రారంభమైన కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ఈ విధమైన ప్రమాదం జరగడం ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తున్నది అధికారుల నిర్లక్ష్యమా, లేక పనులలో నాణ్యత లోపమా, లేదా డిజైన్ లోపమా అన్న అనుమానాలు జనాలలో ఉన్నవి గతంలో జెన్కో శ్రీశైలం జల విద్యుత్ శక్తి కేంద్రంలో కూడా ప్రమాదం జరగడం పలు అనుమానాలకు దారితీస్తుంది. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుపై ఖర్చుపెట్టిన డబ్బు 2649 కోట్లు అని అధికారులు చెప్పారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నాలుగు రోజుల క్రితం జువాలజిస్ట్ కు సంబంధించిన అధికారులు పూర్తిగా చెక్ చేశారు కానీ ఈ విధమైన సంఘటన ఇలా జరిగింది అనే కోణంలో దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపారు టన్నల్ బోరింగ్ మిషన్ వద్ద ప్రమాదం జరిగినట్లు అమెరికన్ ఇంజనీర్ లెనిన్ జూపల్లి కృష్ణారావుకు తెలిపారు ఉదయం 8 గంటలకు బయలుదేరిన సిబ్బంది ఆరుగురు లేబర్ ఇద్దరు అమెరికన్ కంపెనీ రాబిన్సు సంబంధించిన ఇంజనీర్స్ ఈ ప్రమాదంలో చిక్కుకున్నట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.