- తప్పిన పెను ప్రమాదం…
కోరుట్ల, ముద్ర:- కారు లారీ ఢీకొన్న ప్రమాదంలో ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావ్ స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థి యాదగిరి శేఖర్ రావ్ నిజామాబాద్ వెళ్లి ప్రచారం ముగించుకొని తిరుగు ప్రయాణం కరీంనగర్ వెళుతున్న క్రమంలో కోరుట్ల పట్టణ కృష్ణ మందిరం వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాదగిరి శేఖర్ రావ్ కు చేతికి స్వల్ప గాయాలు కాగా అతను ప్రయాణిస్తున్న కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది.