Take a fresh look at your lifestyle.

జనగణనలో అందరూ భాగస్వామ్యులు కావాలి ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్ ప్రతిమా

ముద్ర ప్రతినిధి, మెదక్:
జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకమన్నారు.
సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తా నుండి పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వరకు మొదటి దశ జనగణనపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు.
ప్రజల సహకారంతో కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. అనంతరం జనగణన ట్యాబ్లు ఆవిష్కరించారు. మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇది మొదటి జనగణన అని, మొదటి సారి డిజిటల్ విధానంలో ఈ జనగణన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జనగణన ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలను సేకరించడం జరుగుతుందని అన్నారు. వారికి సహకరించాలని సూచించారు.
జనగణన పేరుతో ఎవరైనా అనుమానిత వ్యక్తులు మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగే అవకాశం ఉంటుందని, అలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. జనగణనలో పాల్గొనే సిబ్బందికి జారీ చేసిన గుర్తింపు కార్డుల మీద క్యూ ఆర్ కోడ్ ఉంటుందని, దానిని స్కాన్ చేస్తే అధికారిక వెబ్ సైట్ లో పొంది ఉంచిన వారి పూర్తి వివరాలు వస్తాయని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్,
మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధికా భూపతి రాజు, మెదక్ ఆర్డీవో రమాదేవి, డీఎఫ్ఓ జోజి, జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాష్ రావు, తహసిల్దార్ లక్ష్మణ్ బాబు, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సంబంధిత జిల్లా అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, మెప్మా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సాఫీగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ
కొల్చారం మండల కేంద్రంలో ప్యాక్స్ వరి కొనుగోలు కేంద్రం, సత్య సాయి రైస్ మిల్ ను కలెక్టర్ ప్రతిమా సింగ్ పరిశీలించారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా జిల్లాలో సాఫీగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని, కొనుగోలుకు సంబంధించిన అన్ని సౌకర్యాలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉన్నాయని, రవాణాలో జాప్యం లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్లోడింగ్ లో సమస్యలు తలెత్తుకుండా మిల్లర్లు సమన్వయంగా వ్యవహరించాలని సూచించారు.
హెచ్.పి.వి వాక్సిన్ పై అవగాహన
హెచ్ పి. వి వాక్సిన్ పై అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో హెచ్.పి.వి వాక్సిన్, ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు, సిఎస్ఆర్ నిధులు, ఉపాధి హామీ పథకం, జనగణనపై సమీక్షించారు.
జిల్లాలోని 14 నుంచి 15 మధ్య వయస్సు గల బాలికలందరికి హెచ్.పి.వి వ్యాక్సిన్ ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.
ఈనెల 13 నుంచి 21 వరకు జరిగే ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు.
విద్యార్థులు పరీక్షలను ప్రశాంత వాతావరణంలో రాయడానికి కావలసిన ఏర్పాట్లు అన్ని పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.
పరిశ్రమలు సిఎస్ఆర్ నిధులను సమాజ హితం కోసం అందించాలని పిలుపునిచ్చారు. ఐటిఐ, డిప్లమా, పాలిటెక్నిక్ విద్యార్థులు నేషనల్ అప్రెంటిషిప్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
జిల్లాలో ఉపాధి హామీ కార్మికుల సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వందరోజుల పని కల్పించి ఉపాధి కల్పించాలన్నారు.
జనగణనలో ప్రజలందరి భాగస్వామ్యం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ , జెడ్పిసిఓ ఎల్లయ్య, డిఆర్ఓ అంబాదాస్ రాజేశ్వర్, జిల్లా వైద్యాధికారి శ్రీరామ్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మాధవి, మెడికల్ సూపరిండెంట్ సునీత దేవి, డిసిహెచ్ డా.శివ దయాల్ తదితరులు పాల్గొన్నారు.
డిజిటల్ క్లాస్ రూం బోర్డులు ప్రారంభం
చేగుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిజిటల్ క్లాస్ రూమ్ బోర్డులను కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రారంభించారు. నాణ్యమైన విద్య-భవిష్యత్తుకు నాంది కార్యక్రమంలో భాగంగా డిజిటల్ క్లాస్ రూమ్ బోర్డులను ఏర్పాటు చేశారు.

Leave A Reply

Your email address will not be published.