- అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ప్రజల కృజ్ఞతలు.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలొని హనుమాన్ వాడలో నీటి సమస్య ఉండగా కాలనీ వాసులు ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు.స్పందించిన విప్ లక్ష్మణ్ కుమార్ బుధవారం బోర్ వేయించి మోటార్ పిట్ చేయించి నీటి సమస్యను తీర్చారు.ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు సహకరించిన బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల సుభాష్ కు ఆ కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నగునూరి నర్సగౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దనవేని శంకర్, గ్రామ శాఖ అధ్యక్షులు కొడిమ్యాల రాజన్న, మాజి మార్కెట్ కమిటీ డైరెక్టర్ జంగ శ్రీనివాస్, నక్క శంకర్, పొనకంటి కైలాసం, నగునూరి వెంకన్న, సిరికొండ గ్రామ శాఖ అధ్యక్షులు కుంట మహేష్, దూడ తిరుపతి, విలసాగరపు లక్ష్మిపతి,జక్కుల లచ్చన్న, తదితరులు పాల్గొన్నారు.