Take a fresh look at your lifestyle.

న్యూరో సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

ఎమ్మేల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం

ముద్ర ప్రతినిధి ,నాగర్‌కర్నూల్:

పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో, బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన న్యూరో సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఎమ్మెల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు.


అనంతరం అదే వార్డులోని 9 జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన రుద్ర పాలీ క్లినిక్ హాస్పిటల్‌ను కూడా ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, కౌన్సిలర్లు నిజాం, అనంత అలివేలమ్మ, రాజేశ్వరి, శంకర్, పద్మమ్మ, ఆసిఫా బేగం ఖాదర్, డీసీసీ కార్యదర్శి శ్రీనివాసులు, సర్పంచ్ తిరుపతి గౌడ్, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు హరీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.