ముద్ర, ప్రతినిధి భువనగిరి :
పెండింగ్ లో ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.
మంగళవారం భువనగిరిన సింగన్నగూడెంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద ఇంకా ఏఏ పనులు పెండింగ్ లో ఉన్నాయని , ప్రస్తుతం జరుగుతున్న పనులు ఏవి అవి ఏ ఏ దశలో ఉన్నాయని, మిగిలిన పనులు ఎప్పటి వరకు పూర్తి చేస్తారని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు .
ఈ కార్యక్రమం లో హోసింగ్ ఏ. డి శ్రీ రాములు,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Prabhakar is a sub Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Prev Post