- కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కదిలించే సత్తా ఎవరికి లేదు.
- మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని, రాబోయే స్థానిక సంస్థాలలో జగిత్యాల నియోజకవర్గంలోని 5 మండలాలతో పాటు 2 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సంస్థాగత బలోపే, స్థానిక సంస్థల ఎన్నికల సమాయుత్త సమావేశంలో ఇన్చార్జులు పీసీసీ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకట స్వామి, అంజన్ కుమార్, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పాల్గొని కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జగిత్యాల స్థానిక సంస్థలలో ఎన్నికలలో గెలుపులో ముందు ఉంటుందన్నారు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కదిలించే సత్తా ఎవరికి లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎవరి సలహాలు అవసరం లేదని, స్వంత స్వలబాలకు మాత్రమే పార్టీ మారారు తప్ప అభివృద్ధి కోసం కాదని అన్నారు. అసలు తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా అని అందరు అనుకున్నారు.. కానీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మొదలు పెట్టి కర్ణాటక రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత రాహుల్ గాంధీదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాహుల్ గాంధీ ఆలోచన విధానంతో పని చేసి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని అన్నారు. డబల్ బెడ్రూం డబల్ బెడ్రూం అసలు 4 ,000 ఇండ్లకు శ్రీకారం చుట్టింది జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల పట్టణంలో ప్రతి పేదవాడిని ఒక ఇంటి వాడిని చేయాలని లక్ష్యంతో 120 ఎకరాల స్థలాన్ని స్వీకరించి 80 ఎకరాల ప్రభుత్వ భూమిని కలుపుకొని 200 ఎకరాల భూమిని సేకరించి 4,000 మందికి 100 గజాలలో స్వంత ఇంటి నిర్మాణానికి స్థల కేటాయించడం జరిగిందన్నారు. తదుపరి అదృష్టం బాగాలేదు ఓటమి చెందాను కానీ తదుపరి ఆ ఇండ్లను పూర్తి చేస్తే ఎక్కడ జీవన్ రెడ్డికి పేరు వస్తుందో అని వాటిని పక్కన పెట్టారని పేర్కొన్నారు.నిర్మాణం పూర్తి కాకముందే మౌలిక సదుపాయాలు లేకుండానే ఇండ్లు ఎలా కేటాయించారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తదుపరి డబల్ బెడ్రూంలలో మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయిచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ, మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
