Take a fresh look at your lifestyle.

చిన్నారి వైద్యానికి జేర్కొని రాజు ఆర్థిక సాయం

ఇబ్రహీంపట్నం, ముద్ర విలేకరి: గులియన్ బారే సిండ్రోమ్  కండరాల బలహీనతతో బాధపడుతున్న ఓ చిన్నారికి ఆర్ధిక సాయం అందించి బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షులు జేర్కొని రాజు గొప్ప మనస్సు చాటుకున్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రానికి చెందిన చింతకింద నర్సింహ కుమార్తె తొమ్మిదేళ్ళ హర్షిత అరుదైన గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతోంది. చిన్నారిని శుక్రవారం పరామర్శించిన జేర్కొని రాజు వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 30 వేల ఆర్ధిక సహాయం అందించారు.ఆందోళన చెందవద్దని, అండగా ఉంటానని చిన్నారి తల్లిదండ్రులకు ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు జేర్కొని విరేష్, నూకల అశోక్ కుమార్, నేనావత్ జలేందర్, నేనావత్ సతీష్ నాయక్, బంకుల కిశోర్, ప్రసాద్ గౌడ్, వాలేశెట్టి సాయి కుమార్, బుద్ది శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.