- బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు సీతారాం ధూళిపాళ
ముద్ర, గండిపేట్ : మణికొండ మున్సిపాలిటీలో ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి డిఆర్ఎస్ పార్టీ అన్ని విధాల కృషి చేయడం జరుగుతుందని మున్సిపల్ పార్టీ అధ్యక్షులు సీతారాం దూళిపాళ అన్నారు.గురువారం మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడ సాయి గౌతమ్ నగర్ పరిసర ప్రాంతాల్లో గుడ్ మార్నింగ్ మణికొండ మార్నింగ్ వాక్ నిర్వహించారు.అందులో భాగంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు.చెత్తాచెదారంతో నిండి ఉన్న ముష్కిం చెరువుకు సమీపంలో ఉన్న నేపథ్యంలో కాలనీలో దోమలు తీవ్రమై అనారోగ్యాల భారీన పడుతున్నారన్నారు.కొంతమంది స్వార్థపరులు లోతుగా బోర్లు వేసి నీటిని తోడి ట్యాంకర్లకు ట్యాంకర్లు అమ్మకాలు చేపట్టడం ద్వారా భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని అనుమతులు లేకుండా నీటిని అమ్మే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.నిత్యం విద్యుత్ కోతలను తగ్గించాలని,వీధి కుక్కలతో పిల్లలు వృద్దులు మహిళలు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు.వాటిని షెల్టర్ హోమ్లకు తరలించాలన్నారు.అలనాటి పెర ఉన్న హోటల్ వారి వేడివేడి ఆవిరి లోయర్ల ద్వారా బయటకు వదలడం వల్ల స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని,డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక సమస్యలు ఎదురవుతున్నట్లు తెలిపారు.ఇప్పటికైనా వీటన్నింటినీ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని,పార్టీ నాయకుల దృష్టికి తీసుకు వచ్చినట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో గుట్టమీద నరేందర్,సంఘం శ్రీకాంత్, ఉపేందర్ నాథ్ రెడ్డి, యాలాల కిరణ్, భానుచందర్, కందాట ప్రవీణ్, బొడ్డు శ్రీధర్, సుమనళిని, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.