ముద్ర, కార్వాన్: మీసాల రాముడి కళ్యాణం వైభవంగా కనుల విందుగా జరిగింది లంగర్ హౌస్ త్రివేణి సంగమం రామ్ లీలా మైదానంలో పీఠాధిపతి రాహుల్ దాస్ బాబా ఆధ్వర్యంలో వేద పండితులు రాజనర్సింహ చారి చేతుల మీదుగా కళ్యాణం నిర్వహించారు.ముత్యాల లీలావతి సమక్షంలో సుమలత శేఖర్ బాబు దంపతులు అమ్మవారిని వారి గృహం నుంచి ఊరేగింపుగా త్రివేణి కళ్యాణ వేదికకు తీసుకొచ్చారు.అత్తాపురం శ్రీలక్ష్మి గణేష్ దంపతులు రాములవారిని ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం చూడటానికి వేయి కనులు చాలావన్నంతగా ఆకాశమంత పందిళ్ళ కింద భారీ వేదికపై అంగరంగ వైభవంగా జానకిరాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు.సుముహూర్తాన జీలకర్ర బెల్లం పెట్టి, మాంగల్య ధారణ తలంబ్రాలు వేడుకలు భాజా భజంత్రీలు, చిన్నారుల గీతాల మధ్య భక్తిశ్రద్ధలతో జరిగాయి. దాదాపు 50 వేల మంది భక్తులు తరలిరాగా వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
