Take a fresh look at your lifestyle.

మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి -ఎమ్మెల్యే మందుల సామెల్

* వివిధ మండలాలకు చెందిన 265 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ముద్ర, తుంగతుర్తి….

మహిళలకు సమాన హక్కులు, ఆర్థిక స్వావలంబన, సామాజిక గౌరవం కల్పించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. సోమవారం నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 5 మండలాలకు సంబంధించి 265 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.2,65,30,740 కోట్ల విలువగల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను తెలంగాణ రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ తో కలిసి ఎమ్మెల్యే సామెల్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని అన్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ ఆడపడుచు పెళ్లి చేసి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం పేరుతో వారికి అండగా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణలో మహిళల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 కే గ్యాస్ సిలిండర్ వంటి సౌకర్యాలు మహిళల జీవన ప్రమాణాల్ని మార్చేస్తున్నాయని తెలిపారు.2026 బడ్జెట్లో మహిళా సంక్షేమానికి ప్రాధాన్యమించిన ప్రజా ప్రభుత్వం ఈ పథకాలను మరింత విస్తృతం చేస్తుందని అన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సాయంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ ఉపాధి అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. మహిళలను కోటీశ్వరులు చేయడమే సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ లక్ష్యం అని తెలిపారు.ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో,తుంగతుర్తి గ్రామ సర్పంచ్ మల్లెపాక సాయిబాబు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, సింగల్ విండో మాజీ చైర్మన్ గుడిపాటి సైదులు, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంగరీ గోవర్ధన్, ఐదు మండలాల తహసిల్దార్ లు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, అన్ని గ్రామాల సర్పంచులు,రెవెన్యూ సిబ్బంది, , పచ్చిపాల సుమతి,దాయం ఝాన్సీ రాజి రెడ్డి,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, వివిధ మండలాల నుండి వచ్చిన నాయకులు, విభజన సంఘాల నాయకులు, కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

 

* ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని సన్మానించిన ఎమ్మెల్యే

ఆదివారం వెలువడిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో అత్యధిక మార్కులు (991/1000) సాధించి ప్రతిభ కనబరిచిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పచ్చిపాల వెంకన్న సుమతి దంపతుల కూతురు వైష్ణవి ని స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్, తెలంగాణ రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ తో కలిసి తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు తెలియజేస్తూ రూ .10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవడం ఎంతో గర్వకారణం అన్నారు. ఏం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం విద్యార్థుల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ఇలాంటి ప్రతిభావంతులను ప్రోత్సహించడం మన బాధ్యత అని తెలిపారు.
విద్యార్థిని కృషిని ప్రశంసిస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.