కమలం కు ఓటేద్దాం బిజెపిని గెలిపిద్దాం
4 వ వార్డు ప్రచారంలో కౌన్సిలర్ అభ్యర్థి కొండా శ్వేతా సత్య యాదవ్
ముద్ర, నారాయణపేట:
కమలం గుర్తుకు ఓటు వేసి బిజెపి పార్టీని గెలిపించాలనీ 4 వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి కొండా శ్వేతా సత్య యాదవ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మాజీ కౌన్సిలర్ నవలే విజయ్ తో కలిసి ముమ్మరంగా గాంధీనగర్ లో ప్రచారం నిర్వహించారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీని గెలిపించాలని కోరారు.

వార్డు ప్రజలకు సేవ చేస్తా
కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే వార్డు ప్రజలకు సేవ చేస్తానని పరిష్కారం బిజెపి ద్వారానే సాధ్యమని 16 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కమలాపూర్ అంబికా శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు.

21 వ వార్డు ప్రజలు కమలం గుర్తుకు ఓటు వేయండి
21 వ వార్డు ఓటర్లు తప్పనిసరిగా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని వార్డు బిజెపి కౌన్సిలర్ అభ్యర్థి కమలాపూర్ ప్రభాకర్ ఓటర్లను కోరారు. సోమవారం వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించి బిజెపి ప్రభుత్వ సంక్షేమ పథకాలు… కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు.

వార్డు అభివృద్ధి కోసం 10 వ వార్డు ప్రజలు కమలం కి ఓటు వేయాలి
నారాయణపేట మున్సిపాలిటీ పరిధి 10 వ వార్డు అభివృద్ధి కోసం బిజెపికి ఓటు వేసి గెలిపించాలని కౌన్సిలర్ అభ్యర్థి సిద్ది విశాలాక్షి వెంకట్ రాములు వార్డు ఇంచార్జ్ జ్యోతి సాయిబన్న ఆధ్వర్యంలో సోమవారం ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
1 వ వార్డు సమస్యలను పరిధిలో పరిష్కరిస్తా
నారాయణపేట పట్టణంలోని ఒకటో వార్డులో నెలకొన్న సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సుతారి సత్య రఘుపాల్ అన్నారు. సోమవారం ఒకటవ వార్డు పరిధిలో మాజీ కౌన్సిలర్ అనూష చిన్న రఘు తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.