Take a fresh look at your lifestyle.

సేవా రత్న పురస్కార్ అవార్డుకు ఎంపికైన బాధగౌని మానస గౌడ్

ముద్ర,పానుగల్ :- పానుగల్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన మాజీ సింగిల్ విండో చైర్మన్ బాధగౌని కుమార్ గౌడ్ శారదమ్మ దంపతుల కుమార్తె బాధగౌని మానస సేవా రత్న పురస్కార్ అవార్డుకు ఎంపిక కావడంతో ఆదివారం హైదరాబాద్ మహానగరంలోని భారత్ వికాస్ పరిషత్ కార్యాలయంలో వివేకానంద 163వ జయంతి సందర్భన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట వ్యాప్తంగా సేవా రత్న పురస్కార్ అవార్డుకు ఎంపికైన వారికి సన్మానం చేశారు. పానుగల్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన మానస షైన్ ఎ లైఫ్ ట్రస్ట్ ఫౌండర్ గా ఉన్నారు.

భారత్ వికాస్ పరిషత్ ప్రముఖుల చేతులమీదుగా పురస్కార్ అవార్డు అందుకున్నారు, ఈ సందర్బంగా మానస గౌడ్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రముఖులు వివరిస్తూ అభినందించారు.కార్యక్రమంలో భారత్ వికాస్ పరిషత్ ప్రముఖులు సుబ్భారావు, హన్మంత్ రావు, పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు సతీష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నాగరాజు, కార్యదర్శి మాధవిలత, నర్సింహా చారి, నర్సింహా రావు, మానస గౌడ్ కుటుంబసభ్యులు,తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.