ముద్ర, తెలంగాణ బ్యూరో : భోగి, సంక్రాంతి పండగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ మన సాంస్కృతిక వారసత్వంలో గొప్ప ప్రాముఖ్యతను కలిగివుందన్నారు. సంక్రాంతి వేడుకలు సమాజంలోని అన్ని వర్గాల మధ్య ఐక్యత, సామరస్యాన్ని పెంపొందించే మహిమాన్వితమైన సంప్రదాయమని ఆయన పేర్కొన్నారు. సంక్రాంతి సమయానికి పాడిపంటలు ఇంటికి రావడంతో అందరూ ఆనందోత్సహాలతో పండుగను జరుపుకుంటారని తెలిపారు. ఈ శుభ సందర్బం ప్రేమ, ఆప్యాయత, సౌభ్రాతృత్వం యొక్క గొప్ప ఆలోచనలతో స్ఫూర్తినిస్తుందన్నారు.