బీబీనగర్, ముద్ర:
భువనగిరి నియోజకవర్గం పరిధిలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి వీలుగా భువనగిరిలో మెగాజాబ్ మేళా ను నిర్వహిస్తున్నట్టు కాంగ్రెస్ నాయకుడు పొట్టోల శ్యామ్ గౌడ్ తెలిపారు. కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 8,9,10వ తేదీలలో నిర్వహించే ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు. భువనగిరి శాసనసభ్యుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తనయ, కుంభం ఫౌండేషన్ అధ్యక్షురాలు కుంభం కీర్తిరెడ్డి సహకారంతో ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్టు ఆయన వివరించారు. భువనగిరి పట్టణంలోని న్యూ డైమెన్షన్ హైస్కూల్లో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను భువనగిరి నియోజకవర్గం లోని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కీర్తి రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇన్ని సంవత్సరాల్లో ఏ ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమం నిర్వహించలేదని, ఈ కార్యక్రమం నిర్వహించడం భువనగిరి నిరుద్యోగ యువతీ యువకులకు గొప్ప అవకాశమని అన్నారు. దేశంలోని పలు ప్రముఖ కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు రావడం గొప్ప విషయమని శ్యామ్ గౌడ్ అన్నారు. భువనగిరి నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపేందుకు కుంభం ఫౌండేషన్ తరఫున అధ్యక్షురాలు కుంభం కీర్తి రెడ్డి ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని నిర్వహించడానికి సిద్ధంగా వున్నారని ఆయన తెలిపారు.