కోరుట్ల, ముద్ర విలేకరి: విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా 33 కెవి వల్లంపల్లి, కొనరావుపేట ఫీడర్ టవర్ ను మెట్పల్లి రోడ్ లో జీ ఎస్ గార్డెన్ వద్ద ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులు, డీఎస్పీ రాములు పూజ చేశారు. గతంలో వినాయకుల విగ్రహాలను తరలించే క్రమంలో జరిగిన ప్రమాదం దృష్ట్యా ఈ ఫీడర్ టవర్ ను ఏర్పాటు చేసినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. ప్రమాదాలు జరగకుండా వినాయక మండపం నిర్వాహకులు విద్యుత్ వైర్లను సరిచూసుకోవాలని, విగ్రహాలు తరలింపు సమయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించాలని సూచించారు. సుమారు 30 మంది నిర్వాహకులకు నోటీసులు అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి డీఈ మధుసూదన్, డీఈ టెక్నికల్ గంగారం, ఏడీఈ రఘుపతి, ఏఈలు, సిబ్బంది, వినాయక మంటప కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు.