రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : దివ్యాంగుల పేరుతో చేసే రాజకీయాలను మానుకోవాలని అమ్మ వికలాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పందుల రవి,పట్టణ అధ్యక్షుడు మారపెల్లి నరేష్ అన్నారు. మంగళవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం వారు మాట్లాడారు. ఇటీవల జిల్లా కేంద్రంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో సమస్యలు తెలిపేందుకు వెళ్లిన అమ్మ వికలాంగుల సంక్షేమ సంఘానికి తమకు సంబంధం లేదని చెప్పడం చూస్తే దివ్యాంగులను వాడుకున్నట్లేనని ఆరోపించారు. కార్యదర్శి రవి కుమార్,అజిత్ పాషా, వెంకటేశ్, సతీష్, తిరుమల పాల్గొన్నారు.