- ఊరిలోకి అన్నలు వచ్చారు.
- ఎవరి నోటా విన్న అన్నల మాటే.
ముద్ర ప్రతినిధి భూపాలపల్లి రేగొండ : కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న మావోయిస్టుల అలజడి గ్రామాల్లో మొదలయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాక, రేపాక పల్లి గ్రామాల్లోకి అన్నలు వచ్చారు. ముడు రోజులు గ్రామంలో తిరగారు అంటూ ఎవరి నీట విన్న ఎక్కడ నలుగురు కలిసిన అదే మాట.గాజర్ల రవీ, అలియాస్ గణేష్ అన్న మృతి చెంది న నాలుగు రోజులకు రేగొండ మండలంలోకి అన్నలు వచ్చారు అనే మాట సంచలనం రేపుతోంది. రేగొండ మండలం రేపాక గ్రామానికి గత ముడు రోజుల క్రితం రాత్రి ముగ్గురు మావోయిస్టు లు వచ్చారట ముడు రోజులుగా తిరుగుతున్నారట అంటూ రేగొండ, మరియు రేపాక గ్రామానికి చుట్టూ ప్రక్కల గ్రామాల్లో వినిపిస్తున్నా మాట.రేపాక గ్రామంలో మాటు వేశారని ఎవరినో హత్య చేయడానికి వచ్చారని గుసగుసలు ఆడుతున్నారు. ఒకప్పుడు తెలంగాణ పల్లెలు అన్నలకు పట్టు కొమ్మళ్ళ ఉండేవి కానీ ఇప్పుడు కుంబింగ్ ల పేరుతొ ఎంకౌంటర్ ల పేరుతొ మావోయిస్టు లు పల్లెల్లో లేకుండా పోయారు. కానీ మళ్ళీ రేపాక గ్రామానికి వచ్చారు. రేగొండ లో తిరుగుతున్నారు. అంటూ వాదంతులు రావడంతో కొంత మంది నాయకుల్లో అలజడి మోదలయింది కానీ ఈ విషయం పై పోలిసులు మాత్రం వదంతులు నమ్మొద్దు అంటూ ఎమీ ధ్రువీకరించలేక పోతున్నారు.