దేశ రక్షణ కోసం ఆత్మ త్యాగానికి కూడా సిద్ధంగా ఉండాలి
ముద్ర, నారాయణ పేట:
పుల్వామా ఉగ్ర దాడిలో అమరులైన ఆర్మీ జవాన్లకు ఘన నివాళి అర్పిస్తూ శనివారం నారాయణపేట జిల్లా కేంద్రంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీని గొడుగు గేరీ హనుమాన్ మందిరం సత్యనారాయణ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున రాయాలని నిర్వహించారు. భారత దేశ ద్రోహుల్లరా ఖబర్దార్… ఖబర్దార్…భారత్ మాత కి జై… జోహార్ ఆర్మీ జవాన్లకు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రేమికుల రోజు అనేది ఉన్మాద భావన అన్నారు. భారత దేశం జోలికి వేస్తే ఏ గతి పడుతుంది పాకిస్తాన్ కు ఇండియన్ ఆర్మీ సత్తా ఇటీవల జరిగిన యుద్ధ సమయంలో అర్థం అయి ఉంటుందన్నారు. భారతదేశంలో ఉంటూ పరాయి దేశానికి వత్తాసు పలికే వారిని వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. దేశ భద్రత కోసం అందరూ ఐక్యమత్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ దేశాలకు విశ్వ గురువు భారత దేశమన్నారు. ప్రతి ఒక్కరూ దేశం కోసం పని చేయాలన్నారు. దేశాన్ని ప్రేమించేవాడు భారత దేశస్తుడన్నారు. దేశ ద్రోహులకు ఇక్కడ జీవించే హక్కు లేదన్నారు. హిందువుల జోలికి వస్తే ఉపేక్షించేది లేదన్నారు. భారతదేశంలో ఉన్న ప్రతి హిందువు దేశ రక్షణ కోసం ఆత్మ త్యాగానికి కూడా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం అమరుల ఆత్మ శాంతించాలని మౌనం పాటించారు. నగర గణేష్ ఉత్సవ కమిటీ అద్యక్షులు భీమ్ చందర్ గౌడ్, జిల్లా కార్యదర్శి కన్న శివకుమార్, మ్యాడమ్ ప్రభాకర్, రామచందర్, చంద్రకాంత్, కడుదాస్ ప్రవీణ్, శ్రవణ్, సచిన్, నరేష్, చరణ్ రెడ్డి, అనంత్ రెడ్డి, చంద్ర శేఖర్, చంద్ర కాంత్ యాదవ్, ఆశిష్, అశ్విన్, ఆకాష్, చక్రి, అరవింద్, శివాజీ రవి, రాజ శేఖర్, అనిల్ రెడ్డి, రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.