Take a fresh look at your lifestyle.

ఎన్నికల విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవు-జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి వెల్లడి

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సిబ్బంది కేటాయింపుకు మూడో విడత ర్యాండమైజేషన్ పూర్తి

 

 (ముద్ర ప్రతినిధి – ఉమ్మడిరంగారెడ్డి జిల్లా):

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం పోలింగ్ సిబ్బంది మూడవ ర్యాండమైజేషన్ ప్రక్రియను ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు మాయాంక మిట్టల్, జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సమక్షంలో పూర్తి చేశారు.

జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ఈ ప్రక్రియను చేపట్టారు. జిల్లాలో ఎన్నికలు జరుగనున్న ఆరు మున్సిపాలిటీలకు సంబంధించి పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులను, కౌంటింగ్ సిబ్బందిని, మైక్రో అబ్జర్వర్స్ ను మూడవ ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఎవరైనా విధులకు గైర్హాజరు అయినట్లయితే ఎన్నికల నిబంధనలను అనుసరించి కఠిన చర్యలు తీసుకోబడుతాయని కలెక్టర్ హెచ్చరించారు. ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియలో డీపిఓ సురేష్ మోహన్, జీఎం డి.ఐ.సి. శ్రీలక్ష్మి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.