మార్చి 31 వరకు నిర్మాణ పనులన్నీ పూర్తి చేయండి..
ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించండి..
పెండింగ్లో పెట్టవద్దు..
ఇసుక ఇటుక సిమెంటు కొంత చవకగా లభించేలా అధికారులు దృష్టి సారించాలి..
కరీంనగర్ జిల్లాలో వేగంగా
ఇండ్ల నిర్మాణం..
ప్రోగ్రెస్ చాలా బాగుంది..
డబుల్ బెడ్ రూమ్ లను లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోండి..
రాష్ట్ర గృహనిర్మాణ శాఖ కార్యదర్శి, హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి గౌతమ్..
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి అలుగునూరు, కోతి రాంపూర్ లో ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన
ఇండ్ల ప్రోగ్రెస్ పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి కితాబు..
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా మొదటి దశలో ప్రారంభించిన పనులన్నింటినీ మార్చి 31 లోగా పూర్తిచేసుకునేలా చూడాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి, హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేసి లబ్ధిదారులు సంబురంగా గృహప్రవేశాలు జరుపుకునేలా ఇండ్లను రెడీ చేసి ఇవ్వాలని సూచించారు.
బుధవారం కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూరు కోతి రాంపూర్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల ప్రగతిని క్షేత్రస్థాయిలో ఎండి గౌతం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తో కలిసి పర్యవేక్షించారు. ఇండ్ల నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. లబ్ధిదారులతో ఎండి స్వయంగా మాట్లాడారు. ఇంటి నిర్మాణ పనులకు ఎంత ఖర్చయింది.. ఎలా పనులు చేయిస్తున్నారు.. ఇసుక.. ఇటుక..కంకర కు ఎంత ధర చెల్లిస్తున్నారు.. బిల్లులు సకాలంలో వస్తున్నాయా.. నిర్మాణ పనుల్లో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా.. ఇప్పటివరకు పనులకు ఎంత ఖర్చు చేశారు.. పనులను ఏ విధంగా చేస్తున్నారు అని సమగ్రంగా ఆరా తీశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు అన్ని వివరాలు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నామని వారు ఎండికి వివరించారు. సొంటి కల నెరవేరుతున్నదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎండి గౌతమ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులు లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడ పెండింగ్లో పెట్టవద్దని పనులు మరింత వేగవంతంగా జరిగేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మొదటి దశలో ప్రారంభించిన ఇండ్ల తుది పనులు మార్చి 31పూర్తి కావాల్సిందేనని పేర్కొన్నారు. పనులకు సంబంధించి ఎక్కడా జాప్యం జరగవద్దని అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అదేవిధంగా ఇసుక ఇటుక సిమెంటు కొంత చౌక ధరల్లో లభించేలా అధికారులు డీలర్లు నిర్వాహకులతో మాట్లాడాలని ఆదేశించారు. కొంత ధర తగ్గడం వల్ల లబ్ధిదారులకు చేయూతనందించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. దగ్గర్లో ఉన్న ఇసుక క్వారీల నుంచి ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇసుక సరఫరా చేసేలా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. కరీంనగర్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రోగ్రెస్ చాలా బాగుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తో పాటు అధికారులను అభినందించారు. బిల్లులు ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు వారం పదవులకు ఒకసారి బిల్లులు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు.
ఆ తర్వాత కరీంనగర్ లోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తో ఎండి గౌతమ్ సమావేశమయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను రెడీ చేసి లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఇంకేమైనా పనులు పెండింగ్లో ఉంటే వాటిని పూర్తి చేయాలని పేర్కొన్నారు.
ఆయా కార్యక్రమాల్లో హౌసింగ్ పీడీ శ్రీనివాస్ ఆర్ అండ్ బి ఈఈ నరసింహ చారి తిమ్మాపూర్ తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డితో పాటు హౌసింగ్ అధికారులు పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.