Take a fresh look at your lifestyle.

కేసీఆర్ ను కలిసిన కవిత

  • మరోసారి హీటెక్కిన గులాబీ రాజకీయాలు.

ముద్ర, తెలంగాణ బ్యూరో:  కొద్ది రోజుల క్రితం కేసీఆర్‌ చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ లేఖ రాసి వివాదం రేపిన ఎమ్మెల్సీ కవిత వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎర్రవెల్లి ఫాం హౌస్ లో కేసీఆర్ ను కవిత దంపతులు కలిసారు. కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంలో కేసీఆర్.. ఘోష్‌ కమిషన్ ముందు హాజరు అయ్యేందుకు వెళ్తుండగా.. కవిత బుధవారం ఉదయమే ఫాంహౌస్‌కు వెళ్లారు. ఇలాంటి సమయంలో తండ్రికి మద్దతుగా కవిత ఫాం హౌస్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ కు నోటీసులు ఇవ్వటం పైన కవిత ధర్నా నిర్వహించారు. ప్రస్తుత పరిణామాల పైన కేసీఆర్ వద్ద కవిత ప్రస్తావించినట్లు సమాచారం. కాగా, ఇద్దరి మధ్య జరిగిన చర్చల్లో అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

  • కేసీఆర్ తో కవిత సమావేశం.

ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ తదనంతర చోటు చేసుకున్న పరిణామాలు బీఆర్ఎస్ లో కలకలం రేపాయి. ఆ తరువాత తన అన్న కేటీఆర్ లక్ష్యంగా కవిత పలు వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి పైన గౌరవం చాటుతూనే.. ఆయన పక్కన దయ్యాలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించటం పార్టీలో సంచలనంగా మారింది. అదే సమయంలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కోసం ప్రయత్నాలు చేసారంటూ కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా బీఆర్ఎస్ ను ఆత్మరక్షణలోకి నెట్టాయి. ఇక, కేసీఆర్ కు నోటీసులు ఇస్తే కేవలం ట్వీట్ కే పరిమితం అవుతారా ?అంటూ తన అన్నను పరోక్షంగా ప్రశ్నించిన కవిత తన జాగృతి వేదికగా ధర్నా నిర్వహించారు. తాను ఏ పార్టీలో చేరటం లేదని.. తన తండ్రికి మద్దతుగా నిలుస్తూ.. ఉన్న పార్టీని కాపాడుకుంటానని తేల్చి చెప్పారు.ఇక, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పైన కేసీఆర్ సూచనతో హరీష్ స్పష్టత ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో నూ బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని తేల్చి చెప్పారు. ఆ తరువాత కవిత స్పీడ్ తగ్గించారు. తన తండ్రిని కలుస్తానని వెల్లడించారు. ఇప్పుడు కేసీఆర్ కాళేశ్వరం విచారణకు హాజరవుతున్న వేళ కవిత తన భర్త అనిల్ తో కలిసి ఎర్రవెల్లి ఫాం హౌస్ కు వెళ్లారు. అయితే, కేసీఆర్ ను కలిసిన సమయంలో కవిత తాజా వివాదం గురించి చెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. కేసీఆర్ మాత్రం తన మనసులో మాట బయట పెట్టకుండా.. గతంలో మాదిరిగానే కుమార్తెతో వ్యవహరించి నట్లు సమాచారం. ఈ సమయంలోనే నేటి విచారణలో ప్రస్తావనకు వచ్చే అంశాలు.. పరిణామాల పైన హరీష్ తో కేసీఆర్ చర్చించారు.
ఈ విచారణ సమయంలో తండ్రితోనే ఉండాలని కవిత నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ తో కలిసి విచారణ జరిగే బీఆర్కే భవన్ కు కవిత రానున్నట్లు సమాచారం. మాజీ ముఖ్యమంత్రి హోదా లో విచారణ ఎదుర్కోనుండటంతో ఈ వ్యవహారం సంచలనంగా మారుతోంది. కాగా, ఈ రోజు విచారణ తరువాత మరోసారి కవిత తన తండ్రితో సమావేశం కానున్నారు. అటు కేసీఆర్ విచారణ వేళ కేటీఆర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అటు పార్టీ కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసారు. దీంతో, ఇప్పుడు కేసీఆర్ విచారణకు హాజరు. .అటు కవిత భేటీ.. ఈ వరుస పరిణామాలతో
గులాబీలో మరోసారి ఉత్కంఠ పెరుగుతోంది.

Leave A Reply

Your email address will not be published.